బెల్లంపల్లిలో గంజాయి పట్టివేత.. యువకుడు అరెస్ట్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న గోమాసు ప్రకాశ్ (24)ను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్ఓ కె. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.