'పండగ పూట రేషన్ అందక అవస్థలు..': సిపిఎం ఫైర్

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

తిరుపతి రూరల్ మండలంలో పండగ పూట రేషన్ బియ్యం అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. వలసదారుల కారణంగా అదనపు కోటా కేటాయించకపోవడంతో స్థానిక కార్డుదారులకు బియ్యం దక్కలేదని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 3 నాటికే రేషన్ దుకాణాల్లో సరుకులు అయిపోయాయని, అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.