'మోదీ చర్యలు మెచ్చుకోదగినవి': ప్రధానిని అభినందించిన డొనాల్డ్ ట్రంప్

రిపోర్టర్: హరి స్థలం: అమెరికా

భారత్‌లో అక్రమ నల్లమందు సాగును అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మెచ్చుకోదగినవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అధ్యక్ష తీర్మానంలో ఆయన ఈ ప్రశంసలు కురిపించారు. అమెరికా-భారత్‌ డ్రగ్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఇరు దేశాల మధ్య రక్షణ, నిఘా సహకారం మరింత పటిష్టమవుతోందని ట్రంప్ స్పష్టం చేశారు.