క్యాన్సర్ చికిత్స వేళ ఆకస్మిక వివాహం: నటి హినా ఖాన్ సంచలన వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: Mumbai
మూడో దశ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలోనే ప్రియుడు రాకీ జైస్వాల్ ను ఆకస్మికంగా వివాహం చేసుకున్నట్లు ప్రముఖ నటి హినా ఖాన్ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య పరిస్థితుల తీవ్రత కారణంగానే పెళ్లి విషయంలో తాను హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ పై అనిశ్చితి వల్లే పదిహేను నిమిషాల్లోనే రిజిస్టర్ మ్యారేజ్ పూర్తి చేశామని, పెళ్లి తర్వాత తమ జీవితంలో పెద్దగా మార్పులేదని ఆమె స్పష్టం చేశారు.