హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కీలక నిర్ణయం, నిషేధిత ప్రాంతం ప్రకటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి వెలుపల ఒక నిషేధిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు జాతీయ భద్రతా అధిపతి మొహసెన్ రెజాయ్ వెల్లడించారు. తాము సూచించిన మార్గం కాకుండా వేరే రూట్‌లో వెళ్లే నౌకలను అడ్డుకునేందుకు ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా దిగ్బంధనాన్ని లెక్కచేయకుండా చమురు రవాణా కొనసాగుతోందని, తమ చమురు ట్యాంకర్లపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.