రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాసలో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె స్పష్టంగా ఆదేశించారు.