లేటరైట్ తవ్వకాలకు సిపిఎం వ్యతిరేకం, సిరిపురం ప్రజాభిప్రాయ సేకరణలో- సిపిఎం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

ఈ రోజు నాతవరం మండలం, సుందర కోట పంచాయతీ, సిరిపురం లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పోలీసులు నిర్భంద నడుమ జరిగింది. పాల్గొనేందుకు వెళ్లిన CPM జిల్లా కార్యదర్శి G. కోటేశ్వరరావు ను, వెదురుపల్లి సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ నాతవరం మండలం సుందరకోట పంచాయితీ కొత్త సిరిపురం గ్రామంలో లేటరైట్ తవ్వకాల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమే. బమిడికలొద్ది గ్రామంలోని 121 హెక్టార్ల లేటరైట్ తవ్వకాల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.

సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది గ్రామంలో సర్వే చేయని కొండ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల గిరిజనుల జీవనాధారం, వ్యవసాయం, భూగర్భ జలాలు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. గిరిజనుల హక్కులకు రక్షణగా ఉన్న 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకుండా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం అన్యాయం.

ఇప్పటికే ఈ ప్రాంతంలో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనివల్ల నాగులకొండ, అల్లూరి గృహాలు, సరుగుడు వాటర్‌ఫాల్స్‌తో పాటు వాగులు, గెడ్డలు, అటవీ సంపదకు ముప్పు ఏర్పడుతోందని తెలిపింది. కొండల తవ్వకాల వల్ల తాగునీరు, సాగునీటి సమస్యలు ఏర్పడి తాండవ, వరహా నదులపై కూడా ప్రభావం పడే ప్రమాదం పడుతుంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.

ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా వినడమే తప్ప, ప్రజలను అడ్డుకోవడం కాదని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. పౌరులకు తమ అభిప్రాయాన్ని చెప్పే, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే, తమ జీవనాధారం–పర్యావరణ పరిరక్షణ కోసం నిరసన తెలిపే హక్కు ఉంది. సిపిఎం నాయకులను ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేస్తుంది. ప్రజల ప్రశ్నించే హక్కును, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం దుర్మార్గం ఈ కార్యక్రమంలో S. నాగరమణ పాల్గొన్నారు.