కొండల తవ్వకాలతో పర్యావరణానికి, గిరిజనుల జీవనాధారానికి ముప్పు తప్పదని సిపిఎం హెచ్చరిక
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది గ్రామంలో సర్వే చేయని కొండ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇస్తే గిరిజనుల జీవనాధారం, వ్యవసాయం, భూగర్భ జలాలు దెబ్బతింటాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. 1/70 చట్టం, పీసా చట్టాలను అమలు చేయకుండా మైనింగ్ చేయడం అన్యాయమన్నారు. అనుమతులకు మించి అక్రమ మైనింగ్ జరగడం వల్ల నాగులకొండ, సరుగుడు వాటర్ఫాల్స్తో పాటు వాగులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, తాండవ, వరహా నదులపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.నాగరమణ పాల్గొన్నారు.