తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం ములుగు జిల్లాలను ముంచెత్తనున్న కుంభవృష్టి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో పొడి వాతావరణం నెలకొంది. తుపాను ప్రభావంతో నేడు ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, హనుమకొండ సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.