దేశవ్యాప్తంగా పలు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: India

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ఖాళీ అయిన 5 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి మాత్రం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని ఈసీ స్పష్టం చేసింది.