దాడి ఘటనలో యూసుఫ్ మృతి: కుటుంబ సభ్యులపై అగంతకుల దారుణం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
అల్లర్లు మరియు దాడుల ఘటనలో యూసుఫ్ మృతి చెందినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఈ ఘోర దాడిలో మృతుడి కుమారుడికి కాలికి శస్త్రచికిత్స జరుగుతోందని, మరో కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మూడు వేళ్లు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కూతురు, భార్య సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంటూ బాధితుల కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.