ఖమ్మం కొత్తగూడెంలో మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని 14, 15వ డివిజన్ల కొత్తగూడెంలో పగడాల మల్లేష్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు, కోలాటాలతో సందడి చేశారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక నిమజ్జనంతో వేడుకలు ముగిశాయి.