హైవేపై దారుణం: కదులుతున్న బస్సులో నుంచి తోసి ఆర్టీసీ కండక్టర్ మృతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: భద్రాద్రి-కొత్తగూడెం

రూపాయి చిల్లర విషయంగా జరిగిన వాగ్వాదంతో ప్రయాణికురాలు కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేయడంతో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు వెల్లడించారు. ఈ అన్యాయమైన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.