విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: కావలిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
రిపోర్టర్: Alfa News Service
స్థలం: కావలి
చదువు ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని టీడీపీ సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కావలి నియోజకవర్గం బ్రాహ్మణక్రాక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన తన సొంత నిధులతో జలదంకి మండలంలోని ఐదు పాఠశాలల విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత కుట్టుమిషన్ల శిక్షణా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.