దక్షిణ డెల్లీలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితులు

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

దక్షిణ డెల్లీలోని ఆస్తా కుంజ్ పార్కులో పదిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు తీవ్ర దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ఆసిఫ్, హేమంత్ సింగ్, ముకేష్ సింగ్‌లను అరెస్టు చేసిన పోలీసులు, వీరు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేపట్టారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు గుర్తించిన దర్యాప్తు బృందాలు, వారి మొబైల్ ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.