సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమంటూ కేటీఆర్ సవాల్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎలాంటి తప్పు చేసినా చర్యలు తీసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని సవాల్ చేసినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. బురదజలితే సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డ్రామాలు బంద్ పెట్టి ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.