ఎండిపోతున్న పంటలకు సంజీవనిలా మారిన అధికారుల అమూల్యమైన సూచనలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో ఉద్యాన, వ్యవసాయ అధికారుల బృందం పంటలను విస్తృతంగా పరిశీలించింది. సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శోభారాణి, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పత్తి పంటను కాపాడుకోవడానికి లీటర్ నీటిలో ఐదు గ్రాముల యూరియా, మూడు గ్రాముల డీఏపీ కలిపి పిచికారీ చేయాలని రైతులకు ఏడీఏ శోభారాణి అమూల్యమైన సూచనలు చేశారు. ఈ చర్యల ద్వారా పంటలు పది రోజుల పాటు వర్షాభావాన్ని తట్టుకుంటాయని వెల్లడించారు.