పాఠశాలల్లో యోగా శిక్షణ అందించాలన్న మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో యోగ శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో తొంభై శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో వచ్చే ఏడాది చివరికి వందశాతం అక్షరాస్యత సాధించాలన్నారు.