తాగునీటి అవసరాల కోసం కడెం ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేత

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

కడెం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పొలాలకు సాగునీటి విడుదలను నిలిపివేయనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి అవసరాల నిమిత్తం నవంబర్ 7వ తేదీ నుంచి సాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది.