తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: Tirupati District

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగుతున్న తరుణంలో, నవరత్న హోదా కలిగిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా మారింది. సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఈ ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 45 వేల మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.