రాజాపేటలో సర్దార్ పటేల్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ నేతలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేకల రమేష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.