రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరిన శ్రీనివాస్రావు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలు అక్టోబర్ 4వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నం శ్రీనివాస్రావు తనకు కేటాయించిన బ్యాలెట్ సీరియల్ నంబర్ 31పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అనాథలు, అభాగ్యులు, నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, మానవతా సేవలను మరింత విస్తరించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.