పుత్తూరులో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
పుత్తూరు మున్సిపాలిటీ మరియు రూరల్ మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 9,27,114 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.