చెరువుల మరమ్మతులకు శ్రీకారం: అశ్వారావుపేటలో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదినారాయణ
రిపోర్టర్: శివ
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
మురసు తుఫానుతో దెబ్బతిన్న చెరువుల మరమ్మతు పనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శ్రీకారం చుట్టారని అధికారులు తెలిపారు. దమ్మపేట మండలంలో నాలుగు చెరువుల శాశ్వత, తాత్కాలిక మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డీఆర్ నిధులను మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో నాగుపల్లి, దమ్మపేట, ఆసన్నగూడెం గ్రామాల్ లోని చెరువుల వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించామని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు కేటాయించిందని ఆయన స్పష్టం చేశారు.