ఘన్పూర్లో అరవై లక్షలతో మల్టీపర్పస్ భవన నిర్మాణ భూమిపూజ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఉట్నూర్ మండలం ఘనపూర్ శంభుగూడ గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద సుమారు అరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ పనులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం చేపట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.