వందేభారత్ రైళ్లలో చెత్తాచెదారంపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆవేదన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

వందేభారత్ రైళ్లలో ప్రయాణికులు సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న తీరుపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన షేర్ చేసిన ఒక వీడియోలో రైలు సీట్లపై, పాకెట్లలో ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాల వ్యర్థాలను ప్రయాణికులు వదిలేసిన వైనం కనిపించింది. ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో బాధ్యత లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, పౌర స్పృహపై ఆయన దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు.