నూతన NSUI నాయకులకు ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఉట్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను తెలంగాణ రాష్ట్ర NSUI జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన జంగం రామ్ రతన్, జిల్లా అధ్యక్షుడు జంగం శశిధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను యువతలోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.