పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట: వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ఓ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చందాదారులు పీఎఫ్ బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలను వాట్సాప్ వేదికగా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న నిష్క్రియాత్మక ఖాతాల సెటిల్మెంట్ను ఆటోమేటిక్గా చేపట్టే కొత్త ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.