వివేకా భార్య భూమి అక్రమ మార్పిడిలో డిప్యూటీ కలెక్టర్ హస్తం

రిపోర్టర్: కిరణ్ స్థలం: వైఎస్ఆర్ కడప

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ భూమి అక్రమ మార్పిడి కేసులో విచారణ వేగవంతమైంది. అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ మాధవ కృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ కుట్ర జరిగిందని రెవెన్యూ సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. రికార్డులను మాయం చేసి, అక్రమంగా వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేసినట్లు తేలింది. న్యాయం కోసం సునీత, రాజశేఖరరెడ్డి డీఎస్పీని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.