ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా దృక్పథంతో మెరుగైన వసతులు కల్పించాలి: మైఖేల్ హోల్డింగ్

రిపోర్టర్: హరి స్థలం: World

పాకిస్థాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో సరైన వసతులు కల్పించాలని వెస్టిండీస్ మాజీ పేసర్ మైఖేల్ హోల్డింగ్ డిమాండ్ చేశారు. ఒక మానవుడిగా ఆయనకు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు చేసిన విజ్ఞప్తికి హోల్డింగ్ మద్దతు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇమ్రాన్ పట్ల మానవత్వంతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.