నెల్లూరులో మహిళలు, చిన్నారుల భద్రతపై పోలీసుల విస్తృత అవగాహన

రిపోర్టర్: విజయ్ స్థలం: Nellore, Andhra Pradesh

నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు పోలీసులు మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'శక్తి యాప్', 'ఆపరేషన్ చిన్నారి తల్లి', 'ఆపరేషన్ దండాయన' ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరించారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం ఎలా పొందాలో, యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. మహిళా రక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భరోసా నింపింది.