'ఎఫ్‌బీఐ' పేరుతో ఏపీ పరువు తీస్తున్నారు: జగన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పరువును చంద్రబాబు తీసేస్తున్నారని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిపోయిందని మండిపడ్డారు. ఈ సోషల్ మీడియా యుగంలో వాస్తవాలను ఎవరూ దాచలేరని, అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయని వైఎస్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.