ఔషధాల ధరల దోపిడీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం దోపిడీ కాదని, నరమేధంతో సమానమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మండిపడింది. రూ.2,700 విలువైన మందును రూ.27 వేలకు విక్రయిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయని తప్పుబట్టింది. అన్ని మందులపై ఏకరీతిగా 16 శాతం మార్జిన్ ఉండేలా విధానం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.