రామాయణంలో రావణాసురుడి పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన నమిత్ మల్హోత్రా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణం చిత్రంలో రావణాసురుడి పాత్ర విశేషాలను నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. రావణుడు ప్రతి ఒక్కరిలో ఉండే దురాశ, అహంకారానికి ప్రతీక అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న యష్ తమకు గొప్ప అండగా నిలిచారని, ఈ ప్రాజెక్టును ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఆయన ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చారని నిర్మాత నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.