అమరావతిలో విద్యుత్ సరఫరా కోసం సీఆర్‌డీఏ టెండర్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
అమరావతి రాజధానిలో విద్యుత్ పంపిణీ, రీటెయిల్ సరఫరా వ్యవస్థను ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు సీఆర్‌డీఏ టెండర్ ప్రకటన జారీ చేసింది. నెట్‌వర్క్ అభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు, బిల్లింగ్ వంటి సేవల నిమిత్తం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు కోరింది. దరఖాస్తులకు అక్టోబరు 12 గడువుగా నిర్ణయించగా, 13న బిడ్‌లు తెరుస్తామని స్పష్టం చేసింది.