ఆమనగల్లులో భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక ఉత్సవాలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలోని వెంకటగిరి కాలనీలో వినాయక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విష్ణు వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, కౌన్సిలర్ ఎనమల్ల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.