బాలాపూర్ గణనాథుని దర్శించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం

రిపోర్టర్: సునీల్ స్థలం: రంగారెడ్డి

ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత, ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్ల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, చిగిరింత నరసింహారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, కళ్లెం నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.