గణేష్ నిమజ్జనం వేళ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాత్రివేళల్లో రవాణా సౌకర్యం కల్పించేందుకు సెప్టెంబర్ 25, 26, 27 తేదీల రాత్రుల్లో 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, ఫలక్‌నుమా మార్గాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.