మూడు ప్రముఖ ఓటీటీలలో ఏకకాలంగా స్ట్రీమింగ్ అవుతున్న అమీర్ లోగ్ సినిమా

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలతో తెరకెక్కిన కామెడీ డ్రామా చిత్రం అమీర్ లోగ్ ఏకకాలంగా మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్లలో విడుదలైందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో పూర్తిగా నూతన నటీనటులతో రూపొందిన ఈ సినిమా గత నెల 21వ తేదీన థియేటర్లలో నిశ్శబ్దంగా విడుదలైంది. సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల థియేట్రికల్ రన్లో పెద్దగా బజ్ సృష్టించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ఓటీటీలలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోందని తెలిపారు.