ఏఐటీయూసీ రాష్ట్ర నూతన నాయకత్వానికి ఖమ్మం జిల్లా ఉద్యోగుల ఘన అభినందనలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో కరీంనగర్లో జరిగిన ఏఐటీయూసీ నాల్గవ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోట రామాంజనేయులు, కార్యదర్శిగా శివరామకృష్ణ ఎన్నికైన సందర్భంగా ఖమ్మం జిల్లా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం తరఫున ఘన అభినందనలు తెలిపారు. కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన గాదె లక్ష్మీనారాయణ, నిమ్మటూరు రామకృష్ణ, సీతామాలక్ష్మి, పేరబోయిన మోహన్రావులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం నూతన నాయకత్వం మరింత చురుకుగా పనిచేయాలని, ఉద్యోగ కార్మిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంఘం ప్రతినిధులు కోరారు.