కార్పొరేట్ కంపెనీల తీరుపై బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర ఆవేదన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Bengaluru

పండుగ రోజుల్ లో కూడా సెలవులు ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణానికే ఐదు గంటలు పడుతోందని, దీనివల్ల వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదని ఆయన వాపోయారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ప్రైవేట్ సంస్థల్ లోని పనివేళల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది.