పైడితల్లి అమ్మవారి క్రికెట్ టోర్నమెంట్లో సత్తా చాటి ట్రోఫీ గెలిచిన రాయల్స్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను పురస్కరించుకుని విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో రాయల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ పోరులో టైటాన్స్ జట్టుపై గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బొత్స సందీప్ విజేతలను అభినందించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.