నిరుద్యోగులకు గుడ్ న్యూస్: వికారాబాద్ జిల్లాలో రెండు వందల అరవై నాలుగు అంగన్వాడీ పోస్టుల భర్తీ

రిపోర్టర్: శివ స్థలం: వికారాబాద్

తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం రెండు వందల అరవై నాలుగు అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో నూట రెండు టీచర్ పోస్టులు, నూట అరవై రెండు ఆయా పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అక్టోబర్ ఇరవై నాల్గో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.