కావలిలో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం: మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ ఆదేశాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కావలి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు పురపాలక సంఘం యంత్రాంగం రంగంలోకి దిగింది. కావలి పురపాలక సంఘం కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఉదయం ఉదయగిరి కూడలి వద్ద ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మార్గాల్లో ఇరువైపులా ఉన్న అన్ ఆథరైజ్డ్ నిర్మాణాలను తొలగించి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారులైన చిరు వ్యాపారులకు సర్దిచెప్పిన ఆయన, నగరంలో ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.