పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన సీపీ

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సీసీటీఎన్ఎస్, పెండింగ్ కేసులు, రౌడీషీటర్ల కదలికలు, పెట్రోలింగ్ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను చట్టపరిధిలో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. హైవే, రైల్వే స్టేషన్ల నేపథ్యంలో రోడ్డు మరియు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆయన స్పష్టం చేశారు.