యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి గ్రామంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి గ్రామంలో పురవీధుల గుండా హరే రామ హరే కృష్ణ జప యజ్ఞంతో శివాంజనేయ భక్త భజన మండలి వారిచే నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేశ్వరం దయాకర్ తో పాటు పలువురు స్థానికులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక భక్తి భావాన్ని చాటుకున్నారు.