తాపీ కార్మిక సంఘం నూతన నాయకులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం నూతన అధ్యక్షుడిగా సంకరి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా యెలగం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నయ్య వారిని శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి ప్రవీణ్, తొంగల సత్యనారాయణ, నూనెటి సత్యనారాయణ, ఆవుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.