చైనాలో వైభవంగా పదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రిపోర్టర్: రాజేష్
స్థలం: షాంఘై
చైనా దేశంలోని షాంఘై నగరంలో పదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అట్టహాసంగా ముగిసిందని వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు, ఇరవై ఐదు తేదీలలో ఈ సదస్సును నిర్వహించారు. వివిధ దేశాల నుంచి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పలు కీలక గ్రంథాలను ఆవిష్కరించారు.