స్థానిక ఎన్నికల వేళ ఉద్రిక్తతలు: పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Amaravati

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులను నివాసాలకే పరిమితం చేశారు. అలాగే చిత్తూరులో ఏజెంట్ల అదుపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి.