పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన శిక్ష విధించిన విశాఖ కోర్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన మైనర్ బాలిక ఆత్మహత్య మరియు పోక్సో కేసులో నిందితుడు ఎర్ని విజయ్ గణపతి కృష్ణ కుమార్కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్షా పది వేల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులకు నష్టపరిహారంగా లక్ష రూపాయలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.